అక్షరటుడే, వెబ్‌డెస్క్:Railway Passengers | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) మరో మూడు, నాలుగు నెలల్లో జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటికే అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఎలాగైన విజయం సాధించాలని చూస్తోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ(Prime Minister Modi) బీహార్‌లో ఇటీవల పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తాజాగా రైల్వే శాఖ
(Railway Department) బీహార్‌లో జోగ్బానీ నుంచి చెన్నై సెంట్రల్‌కు డైరెక్ట్ రైలు నడపాలని నిర్ణయించింది. ఈ రైలు అతి త్వరలో అందుబాటులోకి రానుందని బీహార్ డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్(Bihar Deputy CM Tar Kishore Prasad) పేర్కొన్నారు. కాగా జోగ్బాని నేపాల్‌కు సరిహద్దులో ఉంటుంది.
బీహార్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్(BJP MP Pradeep Kumar Singh) కూడా జోగ్బానీ నుంచిచెన్నై సెంట్రల్‌కు కొత్త డైలీ ఎస్ఎఫ్ ఎక్స్ ప్రెస్ అతి త్వరలో నడుస్తుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దీనిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ రైలు విజయవాడ – బల్హర్షా – నాగ్‌పూర్ – గోండియా – జబల్‌పూర్ లైన్ ద్వారా నడుస్తుందని తెలిపారు. బీహార్ నుంచి ఎంతో మంది దక్షిణాదిలో కూలీ పనుల నిమిత్తం వస్తుంటారు. ఈ క్రమంలో ఈ రైలు అందుబాటులోకి వస్తే వారికి ఎంతో మేలు జరగనుంది.