అక్షరటుడే, వెబ్‌డెస్క్: BCCI | గత రాత్రి ఐపీఎల్ 2025లో (IPL 2025) భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (sunrisers hyderabad and lucknow super giants) మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ను ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి (LSG spinner digvesh rathi) అవుట్ చేయడంతో ఊహించని సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితిని అదుపు చేయడానికి అంపైర్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. అయితే అభిషేక్ శర్మతో (abhishek sharma) గొడవ పడినందుకు దిగ్వేష్ కఠినమైన శిక్షను ఎదుర్కొన్నాడు. దిగ్వేష్‌పై బీసీసీఐ (BCCI) ఒక మ్యాచ్ నిషేధం విధించింది. గుజరాత్ టైటాన్స్‌తో (gujarath titans) జరిగే మ్యాచ్‌లో అతను ఆడే ఛాన్స లేదు. అలానే దిగ్వేష్ రతి మ్యాచ్ ఫీజులో (digwesh rathi match fee) 50 శాతం కూడా తగ్గించబడింది.
BCCI | ఇద్దరికి జరిమానా..
అభిషేక్ శర్మ (abishek sharma) తన మ్యాచ్ ఫీజులో 25 శాతం కూడా కోల్పోవాల్సి వచ్చింది. మైదానంలో అభిషేక్ శర్మ, దిగ్వేష్ల మధ్య తీవ్ర వాదన జరిగింది. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే ఆటగాళ్లు, అంపైర్లు (umpire) జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దిగ్వేష్ ఇప్పుడు మొత్తం 5 డీమెరిట్ పాయింట్లను కలిగి ఉన్నాడు. దీని కారణంగా దిగ్వేష్ ఇప్పుడు ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నోట్‌బుక్ వేడుకకు (notebook celebration) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు రెండుసార్లు జరిమానా విధించింది. అయినప్పటికీ అతను వేడుకలు జరుపుకోవడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అభిషేక్‌తో వాదన తర్వాత మరో శిక్ష ముప్పును ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ తర్వాత, ఇద్దరూ ఆ సంఘటన గురించి చర్చించుకుని ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు. ఆ తరువాత బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (BCCI vice president rajiv shukla) వారిద్దరితో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (man of the match) అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. తాము ముందుగా బ్యాటింగ్ (frist batting) చేసి ఉంటే తన ప్రణాళిక వేరేలా ఉండేదని అన్నాడు. 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు తానుమరింత కష్టపడి పనిచేయాలని అనుకున్నట్టు చెప్పాడు. అయితే ఏ అంతర్జాతీయ ఆటగాడిని అడిగినా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో పవర్‌ప్లే (power paly) అనుకూలంగా ఉండేలా చూసుకోవాలని చెబుతారని అభిషేక్ స్పష్టం చేశాడు. అభిషేక్ తన ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, 4 ఫోర్లు బాదాడు. తాను బాగా రాణిస్తే జట్టు కూడా బాగా రాణిస్తుందని నమ్ముతానని అభిషేక్ పేర్కొన్నాడు. మ్యాచ్ తర్వాత తాము మాట్లాడుకున్నామని.. ఇప్పుడు అంతా బాగానే ఉందని అభిషేక్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ (IPL) నిబంధనలను ఉల్లంఘించిన ఈ ఇద్దరికి మ్యాచ్ రిఫరీ జరిమానా (match referee fine) విధించారు.