అక్షరటుడే, వెబ్‌డెస్క్: Diabetic patients | ఉరుకుల పరుగులు జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒత్తిడి సహజం. అయితే, టెన్షన్లు tension మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై health ప్రభావం చూపుతాయి. నిద్రలేమి, అజీర్ణం indigestion, ఊబకాయం వంటి సమస్యలు కలిగిస్తాయి. అదే, డయాబెటిక్ రోగులైతే diabetic patients ఒత్తిడి stress ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి stress వల్ల రక్తంలో blood చక్కెర హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. ఇది డయాబెటిక్ రోగిలో మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. టెన్షన్లతో డయాబెటిక్ రోగులు ఎలా ప్రభావమవుతారనేది తెలుసుకుందాం.
Diabetic patients | హార్మోన్ల ప్రభావం
ఒత్తిడిలో ఉన్నప్పుడు, శరీరం అడ్రినలిన్, కార్టిసాల్ adrenaline and cortisol వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు కాలేయం రక్తప్రవాహంలోకి ఎక్కువ గ్లూకోజ్‌ను glucose విడుదల చేయడానికి ప్రేరేపించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను blood sugar levels పెంచుతాయి. టైప్ 2 డయాబెటిస్ type 2 diabetes ఉన్న వ్యక్తులలో వర్క్ ప్రెషర్స్ Work pressures తరచుగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఎందుకంటే ఒత్తిడి హార్మోన్లు శరీరాన్ని ఇన్సులిన్కు insulin మరింత నిరోధకతను కలిగిస్తాయి. కణాల ద్వారా గ్లూకోజ్ glucose తీసుకోవడం నిరోధిస్తుంది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో ఒత్తిడి మరింత ఇబ్బందులను తీసుకొస్తుంది.
రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. కొంతమందిలో పెరుగుదల కనిపిస్తే, మరికొందరిలో తక్కువగా ఉంటుంది. అనారోగ్యం, గాయం లేదా శస్త్రచికిత్సలు వంటివి శారీరక ఒత్తిళ్లుగా పని చేస్తాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను blood sugar levels పెంచుతుంది. ఈ సమయాల్లో శరీర ఒత్తిడి body stress ప్రతిస్పందన షుగర్ నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఒత్తిడితో వల్ల కలిగే ఆందోళన మనల్ని నిరాశకు గురి చేస్తుంది. శారీరకంగా, మానసికంగా physically and mentally దెబ్బ తీస్తుంది. భావేద్వగాలు అదుపు తప్పేలా చేస్తుంది. టెన్షన్ tension మరింత పెరిగితే గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ, నరాల సమస్యలు తలెత్తుతాయి.
Diabetic patients | టెన్షన్ నివారణకు ఇవి చేయండి..
ఒత్తిడికి దూరంగా ఉండడానికి కొన్ని చిట్కాలు tips ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా చక్కెర స్థాయిలను sugar levels అదుపులో ఉంచుకోవడానికి అవకాశముంటుంది. ధ్యానం, యోగ Meditation and yoga వంటివి క్రమం తప్పకుండా చేయాలి. మానసిక ప్రశాంతతకు mental peace వీటికి మించిన మందు మరొకటి లేదు. అలాగే, రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. కనీసం అరగంట అయినా వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి.
శారీరక శ్రమ Physical activity ఒత్తిళ్లను తగ్గించడమే కాకుండా షుగర్ లెవెల్స్ను controls sugar levels కంట్రోల్ చేస్తుంది. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు vegetables and greens ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఇష్టమైన loved ones వారితో సమయం గడపడానికి ప్రయత్నించాలి. అభిరుచులకు అనుగుణంగా వాటికి సమయం కేటాయించాలి. చిన్న చిన్న టూర్లు ప్లాన్ small tours చేసుకోవాలి. ఆధ్యాత్మిక పర్యటనలు చేయడం ద్వారా ఒత్తిళ్లను మరిచిపోయి సాంత్వన పొందవచ్చు. ఉదయమే లేవడం, రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.