అక్షరటుడే, వెబ్‌డెస్క్: Arunachalam temple | తెలంగాణ నుంచి తమిళనాడు(Tamil Nadu)లోని అరుణాలచ క్షేత్రానికి నిత్యం భక్తులు తరలి వెళ్తారు. ముఖ్యంగా పౌర్ణమి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ(Giri Pradakshina) కోసం వెళ్తుంటారు. అరుణాచలంలో స్వామివారిని దర్శనం చేసుకొని తరిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా నడుపుతోంది. ఆయా డిపోల ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. అయితే తెలంగాణ (Telangana) నుంచి నడపకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎంతో మంది భక్తులు అరుణాచల క్షేత్రానికి (Arunachalam Temple) వెళ్తారు. వీరికి నేరుగా రైలు అందుబాటులో లేదు. దీంతో రైలుమార్గంలో వెళ్లాల్సిన వారు కాచిగూడ నుంచి వెళ్తున్నారు. అయితే ఆ ట్రైన్‌కు రద్దీ అధికంగా ఉండడంతో టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతున్నారు.
Arunachalam temple | బస్సులు అందుబాటులో ఉన్నా..
అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లే వారి కోసం ప్రస్తుతం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రతి పౌర్ణమికి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి ఎంతో మంది భక్తులు అరుణాచలం వెళ్తుంటారు. అయితే బస్సుల్లో ఛార్జీలు అధికంగా ఉండడంతో పాటు దూర ప్రయాణం కావడంతో సౌకర్యంగా ఉండడం లేదని భక్తులు అంటున్నారు. ఈ క్రమంలో అరుణాచలం క్షేత్రానికి ప్రత్యేక రైలు(Special Train) నడపాలని డిమాండ్ చేస్తున్నారు.
Arunachalam temple | ఎంపీలు చొరవ చూపాలి
సిర్పూర్ కాగజ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, కాజీపేట రైల్వే స్టేషన్ల నుంచి అరుణాచలానికి రైలు నడిపే విధంగా రైల్వే అధికారులు ప్రతిపాదనలు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆయా ప్రాంతాల పరిధిలోని ఎంపీలు కృషి చేయాలని వేడుకుంటున్నారు. నరసాపురం నుంచి అరుణాచలం ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం ఎంపీ , కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో వచ్చింది. మన ఎంపీలు కూడా కృషి చేసి ప్రత్యేక రైలు కోసం కృషి చేయాలని ఈ ప్రాంత భక్తులు కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఈ మేరకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.