అక్షరటుడే, వెబ్‌డెస్క్: Simhachalam | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని సింహాచలంలో భక్తుల సందడి నెలకొంది. గిరి ప్రదక్షిణ (Simhachalam Giri Pradakshina) కోసం లక్షలాదిగా భక్త జనం తరలివచ్చారు. అప్పన్న స్వామి తొలి పావంచా వద్ద భారీగా భక్తులు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఒకదశలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, భక్తుల రద్దీ నియంత్రణలో పోలీసులు విఫలమైనట్లు సమాచారం. ఇదే విషయమై కొందరు భక్తులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందే తెలుసు. అయినా, అందుకు అనుగుణంగా పోలీసు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో విధుల్లో పోలీసు సిబ్బంది భక్తులను నియంత్రించలేకపోయారు. ఫలితంగా తొలి పావంచా వద్దకు భక్తులు ఎదురెదురుగా వచ్చారు. ఈ క్రమంలోనే తోపులాటలు చోటుచేసుకున్నాయి.
Simhachalam | సింహగిరి ఘాట్ రోడ్డు వద్ద..
సింహగిరి ఘాట్ రోడ్డు(Simhachalam Ghat Road) వద్ద కూడా గందరగోళం నెలకొంది. ఇక్కడ పోలీసుల POLICE నియంత్రణ లేకుండా పోయింది. ఫలితంగా బస్సులు దిగిన భక్తులు తొలి పావంచా వెనుక వైపు మళ్లుతున్నారు. అక్కడి ఇరుకైన సందు నుంచి ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
Simhachalam | నిలిచిన వాహనాల రాకపోకలు
వేపగుంట VEPAGUNTA కూడలిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద మొత్తంలో వాహనాలు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.