అక్షరటుడే, భీమ్గల్: Limbadri Gutta | లింబాద్రి గుట్ట శనివారం భక్తజన సంద్రమైంది. శ్రీమన్నింబాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో శనివారం లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు క్యూకట్టారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు.
Limbadri Gutta | 6 నుంచి చతుర్మాస్య వ్రతం
ఈనెల 6 నుంచి చతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు శ్రీవారికి నివేదన, నైవేద్యాలను సమర్పించరాదని పూజారులు వివరించారు. చతుర్మాస్య వ్రతం (Chaturmasya Vratham) వచ్చేనెల నాలుగో తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు నంబి విజయ సారథి తెలిపారు.