అక్షరటుడే, బాన్సువాడ: Kasula Balraju | మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరగాలని ఆగ్రో ఇండస్ట్రీస్ (Agro Industries) ఛైర్మన్ కాసుల బాలరాజు అధికారులను ఆదేశించారు. పట్టణంలోని పోలీస్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మెదక్-బాసర హైవే (Medak-Basara Highway) పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పనులను కాసుల బాలరాజు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి (Mla pocharam Srinivas Reddy)సూచన మేరకు పట్టణంలో డ్రెయినేజీ, ఫుట్‌పాత్ పనులు జరగాలని హైవే అధికారులకు సూచించారు.
Kasula Balraju | రహదారికి ఇరువైపులా ఫుట్‌పాత్..
పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా కాంప్లెక్స్‌ల ఎదుట డ్రెయినేజీ పూడికను తొలగించి అడుగు ఎత్తు పెంచాలని, త్వరితగతిన ఫుట్‌పాత్ నిర్మాణాన్ని పూర్తి చేసి వాడుకలోకి తీసుకురావాలని అధికారులకు కాసుల బాలరాజు సూచించారు. స్థానికులు స్వచ్ఛందంగా డ్రెయినేజీలపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఎజాజ్, ఖలేక్, హైవే ప్రాజెక్ట్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.