అక్షరటుడే, బోధన్: Dengue Fever | మండలంలోని రాజీవ్‌నగర్ తండాలో (Rajiv Nagar Thanda) డెంగీ కలకలం సృష్టించింది. తండాలో ఓ వ్యక్తికి డెంగీ సోకగా.. వెంటనే అతడిని నిజామాబాద్ జీజీహెచ్‌కు (Nizamabad GGH) చికిత్స నిమిత్తం తరలించారు.
Dengue Fever | తండా మొత్తం మంచం పట్టింది..
రాజీవ్ నగర్ తండాలో చాలామంది జ్వరాలబారిన పడ్డారు. దీంతో వైద్యసిబ్బంది అలర్ట్ అయ్యారు. తండాలో వెంటనే వైద్యశిబిరం ఏర్పాటుచేసి సుమారు 50 మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. వాటిని పరీక్షల నిమిత్తం పంపారు. అనంతరం తండాలోని కాలనీల్లో పరిశుభ్రతపై ఎంపీడీవో బాలగంగాధర్ , మెడికల్ ఆఫీసర్ జుబేరియా (MPDO Bala Gangadhar) ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరుగుతూ దోమల మందు పిచికారీ చేయించారు.
తండాలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరంలో రోగికి చికిత్స చేస్తున్న మెడికల్ ఆఫీసర్ జుబేరియా