అక్షరటుడే, భీమ్‌గల్ : Bheemgal mandal | భీమ్‌గల్ మండలం రహత్ నగర్ గ్రామానికి (Rahat Nagar village) చెందిన సిరికొండ శిరీష 108 అంబులెన్స్‌లో ప్రసవించింది.
అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ అంబాదాసు, పైలట్ రాజన్న తెలిపిన వివరాల ప్రకారం.. శిరీషకు పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్‌లో భీమ్‌గల్ పీహెచ్‌సీకి (Bheemgal PHC) తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో నొప్పులు ఎక్కువ అవ్వడంతో అంబులెన్స్‌లోనే ప్రసవించింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఈఎంటీ తెలిపారు.