అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని 108లో తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో అంబులెన్స్‌లోనే డెలివరీ (Ambulance Delivery) చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన లక్ష్మి డెలివరీ కోసం బుధవారం నిజాంసాగర్ ప్రభుత్వ ఆస్పత్రి (Nizamsagar Government Hospital)కి 108లో సిబ్బంది తీసుకెళ్లారు. అయితే అక్కడి వైద్యులు బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
Nizamsagar | అత్యవసర పరిస్థితుల్లో..
వ్యైదుల సూచన మేరకు అంబులెన్స్‌లో గర్భిణిని బాన్సువాడ ఆస్పత్రికి తరలిస్తుండగా.. పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో ‘108’ సిబ్బంది డెలివరీ నిర్వహించారు. ఆమెకు మగబిడ్డ జన్మించగా.. వారిరువురు క్షేమంగా ఉన్నారు. డెలివరీ అనంతరం తల్లీబిడ్డలను బాన్సువాడ ఆస్పత్రి (Banswada Hospital)కి తరలించారు. క్లిష్ట పరిస్థితుల్లో కాన్పు చేసిన ఈఎంటీ అరవింద్, పైలెట్ వెంకటేష్‌లను లక్ష్మి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.