అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Zepto delivery boy | చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఐటీ ఉద్యోగినిపై క్విక్ కామర్స్ సంస్థ జెప్టో (Zepto Delivery Boy) డెలివరీ బాయ్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
చెన్నై (Chennai)లోని కుబేరన్ నగర్ (Kuberan nagar) ప్రాంతంలో నివసిస్తున్న మహిళా ఐటీ కంపెనీలో పని చేస్తోంది. ఆమె జెప్టో యాప్ ద్వారా కిరాణా సామగ్రి (Grocery) ఆర్డర్ చేసింది. దీంతో గోపినాథ్ అనే డెలివరీ బాయ్ ఆ వస్తువులను డెలివరీ చేశాడు. అనంతరం ఫోన్లో ఛార్జింగ్ లేదని, కొద్దిసేపు పెట్టుకుంటానని ఆమెను కోరాడు. దీంతో డెలివరీ బాయ్‌ను ఆమె ఇంట్లోకి రానిచ్చింది.
ఛార్జింగ్ పెట్టుకున్న గోపినాథ్ ఇంట్లో ఎవరు లేకపోవడంతో సదరు మహిళపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా గోపినాథ్‌ను అరెస్ట్ చేశారు. కాగా ఈ విషయమై జెప్టోకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని స్థానికులు తెలిపారు. దీంతో జెప్టో కంపెనీ తీరుపై నెటిజెన్లు మండిపడుతున్నారు.