అక్షరటుడే, వెబ్‌డెస్క్: LSG vs DC : ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ Delhi Capitals జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆరో గెలుపు నమోదు చేసింది. మంగళవారం లఖ్నవూ సూపర్ జెయింట్స్(Lucknow Supergiants)తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టు నెగ్గింది.
లఖ్వవూ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 17.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (51), కేఎల్ రాహుల్ (57) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అక్షర్ పటేల్ (34) కూడా రాణించాడు. లఖ్నవూ బౌలర్లలో మర్క్రమ్ 2 వికెట్లు పడగొట్టాడు.