అక్షరటుడే, కోటగిరి: Kotagiri | వీధికుక్కల దాడిలో జింక (Deer) మృతి చెందిన ఘటన పోతంగల్ మండలంలో kotagiri mandal చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దారితప్పి సోంపూర్ (Sompoor) గ్రామంలోకి ఆదివారం రాత్రి ఓ జింక రాగా.. వీధికుక్కలు వెంటపడ్డాయి. కుక్కల దాడిలో జింకకు తీవ్ర గాయాలమయ్యాయి. అక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు.