అక్షరటుడే, లింగంపేట: Lingampet | లింగంపేట ఎస్సైగా దీపక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్సై వెంకట్రావును (SI Venkatrao) వీఆర్‌కు పంపారు. కాగా.. దీపక్‌కుమార్ కరీంనగర్ నుండి బదిలీపై లింగంపేటకు వచ్చారు.
ఈ సందర్భంగా దీపక్‌కుమార్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. మండలంలో శాంతిభద్రతలకు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నూతన ఎస్సైకి పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.