ePaper
More
    HomeజాతీయంJagdeep Dhankhar Resign | ధన్‌ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలు : కాంగ్రెస్ ఎంపీ జైరాం...

    Jagdeep Dhankhar Resign | ధన్‌ఖడ్ రాజీనామాకు లోతైన కారణాలు : కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jagdeep Dhankhar Resign | ఉప రాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్(Vice President Jagdeep Dhankhar)​ రాజీనామా అంశం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్​ సమావేశాల సందర్భంగా ఆయన రాజీనామా(Resign) చేయడంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించినప్పటికి.. లోతైన కారణాలు ఉండి ఉంటాయని ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి, ఎంపీ జైరాం రమేష్(Congress MP Jairam Ramesh)​ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరారు. నిబంధనలు, ప్రొటోకాల్‌ను ధన్‌ఖడ్‌ పాటించేవారన్నారు.

    Jagdeep Dhankhar Resign | అప్పుడే ఏదో జరిగింది

    బీఏసీ సమావేశానికి జేపీ నడ్డా(JP Nadda), రిజిజు(Rijiju) ఉద్దేశపూర్వకంగా రాలేదని జైరాం రమేష్​ ఆరోపించారు. ఈ విషయంలో ధన్‌ఖడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. సోమవారం మధ్యాహ్నం 1గంటల నుంచి 4:30 గంటల మధ్య ఏదో జరిగిందన్నారు. ఆయన రాజీనామాకు లోతైన కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన తన నిర్ణయాన్ని పున:పరిశీలించుకోవాలన్నారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) జగదీప్​ ధన్​ఖడ్​ను ఒప్పించాలని కోరారు.

    READ ALSO  Toll charges |వాహనదారులకు శుభవార్త.. ఆ మార్గాల్లో టోల్ ఛార్జీలు సగమే..

    ఇతర విపక్ష నాయకులు సైతం జగదీప్​ ధన్​ఖడ్​ రాజీనామాపై స్పందించారు. ఆయన అధికార, విపక్షాలను సమానంగా చూసేవారని పేర్కొన్నారు. శివసేన యూబీటీ నాయకులు ఆనంద్​ దూబే(Shiva Sena UBT Leader Anand Dubey) స్పందిస్తూ.. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం బాధాకరమన్నారు. ఆరోగ్య కారణాలతో అయితే పార్లమెంట్​ సమావేశాలకు ముందు లేదా సమావేశాలు పూర్తయిన తర్వాత రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. ఉప రాష్ట్రపతి రాజీనామా తనకు వ్యక్తిగతంగా నచ్చలేదని కపిల్​ సిబల్​ అన్నారు.

    Latest articles

    Ration Cards | రేషన్‌కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్​ నాయకులు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Ration Cards | మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్​ నాయకులు...

    BHVL IPO | మార్కెట్​లోకి మరో ఐపీవో.. జూలై 24న ప్రారంభం కానున్న బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ సబ్​స్క్రిప్షన్​

    అక్షరటుడే, హైదరాబాద్: BHVL IPO | బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ లిమిటెడ్ (BHVL) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO)...

    Mla Rakesh reddy | త్వరలోనే ఆర్మూర్​లో సీఎం రేవంత్​రెడ్డి పర్యటన

    అక్షరటుడే, ఆర్మూర్​: Mla Rakesh reddy | ఆర్మూర్​ నియోజకవర్గంలో (Armoor Constituency) త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి పర్యటన...

    Meghalaya Murder Case | మేఘాల‌య హ‌నీమూన్ హ‌త్య కేసుపై సినిమా.. ఏకంగా బ‌డా హీరోనే ప్లాన్ చేశాడుగా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Meghalaya Murder Case | మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...

    More like this