అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్(Hyderabad)లోని కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఘటనలో తొలుత ముగ్గురు మృతి చెందగా.. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరికొంత మంది మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు.
కూకట్పల్లి పరిధిలోని హైదర్‌నగర్(Kukatpally Hydernagar)లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బాధితుల సంఖ్య 51కి చేరింది. గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital)లో 15 మంది, నిమ్స్(NIMS)లో 34 మందికి చికిత్స అందిస్తున్నారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌లో వైద్యులు డయాలసిస్ చేస్తున్నారు.
Hyderabad | మోతాదుకు మించి కలపడంతోనే..
కల్తీ కల్లు ఘటనలో ఎక్సైజ్ శాఖ అధికారులు(Excise Department Officers) చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పలు కల్లు కంపౌండ్లలో తనిఖీలు నిర్వహించారు. కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. నిషేధిత అల్ప్రాజోలం కలపడంతోనే ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఏడు కల్లు కాంపౌండ్ల లైసెన్స్ రద్దు చేశారు.
కల్తీ కల్లు(Kathi Kallu) తాగిన కొద్ది సేపటికి ప్రజలు తలనొప్పి, వాంతులు, అపస్మారక స్థితికి వెళ్తున్నారు. ఇలాంటి వారిని కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తున్నారు. బాధితుల్లో రోజువారి కూలీలే అధికంగా ఉన్నారు. కల్తీ ఘటనలో ఎక్సైజ్ అధికారులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు.