అక్షరటుడే, ఇందూరు: Nizamabad : గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభించిన చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం (జులై 15) రాత్రి వెలుగుచూసింది. కోటగల్లి వైకుంఠధామం Vaikuntha Dham ఎదుట సదరు యువకుడు మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
నాలుగో ఠాణా పోలీసులు Police ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
మృతదేహంపై నలుపు రంగు టీ షర్ట్, నైట్ ప్యాంటు ధరించి ఉన్నట్లు ఎస్సై SI చెప్పారు. రోడ్డుపై పక్కన చనిపోయి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.