అక్షరటుడే కామారెడ్డి : Kamareddy : కూతురు ఎవరినో ప్రేమించడం ఆ తల్లి mother జీర్ణించుకోలేకపోయింది. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే.. ఇలాంటి బాగోతాలు వెలగబెడుతుందేంటని బాధపడింది. జీవితంపై విరక్తితో బలవన్మరణం చెందాలని భావించింది. అలా రైల్వే ట్రాక్‌పైకి వెళ్తుండగా.. అనూహ్యంగా పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రం (Kamareddy district headquarters) లో ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళవారం (జులై 22) సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు Police తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్.బి నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ కూతురు చేగుంటకు చెందిన యువకుడిని ప్రేమించింది.
Kamareddy : పట్టించుకోని కూతురు..
విషయం తెలిసిన తల్లి.. తన కూతురి daughter ని మందలించింది. అయినా ఆమె వినిపించుకోలేదు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడానికి రైలు పట్టాలపైకి వెళ్ళింది. గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని వివరాలు సేకరించారు. కౌన్సెలింగ్ ఇచ్చి, భర్తకు ఆమెను అప్పగించారు.