అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Raids | కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో చేపలు ఉండాలి.. కానీ ఇక్కడ తిమింగలాలు ఉన్నాయి. అవి మాములు తిమింగలాలు కూడా కాడు… భారీ అక్రమాలకు పాల్పడిన అవినీతి తిమింగలాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project) పేరిట భారీగా ప్రజాధనాన్ని దోచేశారని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్ కుటుంబం కోసమే దీనిని నిర్మించారని కాంగ్రెస్, బీజేపీ నాయకులు (BJP Leaders) ఆరోపిస్తున్నారు. రూ.లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్ట్‌తో ఉపయోగం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో కాళేశ్వరంపై విచారణకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు(Former Ministers Harish Rao), ఈటల రాజేందర్‌ను విచారించింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో కీలకంగా వ్యహరించిన పలువురు అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు(ACB Officers) వీరి పని పడుతున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఈఈ పని చేసిన నూనె శ్రీధర్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. తాజాగా మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావును అదుపులోకి తీసుకుంది.
ACB Raids | ఏకకాలంలో సోదాలు
మురళీధర్‌రావు ఇరిగేషన్ ఇంజినీర్ ఇన్ చీఫ్‌గా పని చేశారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు మంగళవారం మురళీధర్‌రావు(Muralidhar Rao) ఇంటితో పాటు 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు.
ACB Raids | గతంలో నూనె శ్రీధర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(Executive Engineer)గా పని చేసిన నూనె శ్రీధర్ (Nune Sridhar)ను గతంలో ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూన్ 11న ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన అవినీతి బాగోతాన్ని చూసిన ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు. ఒక ఈఈ రూ.500 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టారు. దీంతో కాళేశ్వరంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చు.
ACB Raids | 13 ఏళ్ల పాటు పదవీకాలం పొడిగింపు
ఓ అధికారి పదవీ కాలాన్ని అవసరాన్ని బట్టి రెండేళ్లు, మూడేళ్లు పొడిగించడం చూస్తుంటాం. అయితే గతంలో ఈఎన్సీగా పని చేసిన మురళీధర్‌రావు పదవీకాలాన్ని మాత్రం 13 ఏళ్లపాటు పొడిగించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఈఎన్సీ జనరల్‌గా వ్యవహరించిన మురళీధర్‌రావు అప్పుడే రిటైర్డ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన కొద్ది రోజులు పని చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక(Vigilance Report) అనంతరం ఆయనను ప్రభుత్వం తొలగించింది. తాజాగా అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.