అక్షరటుడే, ఇందూరు: Alumni Reunion | అనారోగ్యంతో మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని తోటి కానిస్టేబుళ్లు ఆదుకున్నారు. తమ వంతుగా ఆర్థికసాయం అందించారు. నస్రుల్లాబాద్ (Nasrullahabad) మండలానికి చెందిన 2004 బ్యాచ్ కానిస్టేబుల్ (2004 batch constables) బుచ్చయ్య రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో ఆ బ్యాచ్ కానిస్టేబుళ్లు అంతాకలిసి బుచ్చయ్య కుటుంబాన్ని ఆదుకునేందుకు నిర్ణయించుకున్నారు.
Alumni Friends | పీటీసీ ట్రెయినింగ్ బ్యాచ్ అంతా ఏకమై..
ఈ సందర్భంగా 2004లో పీటీసీ ట్రెయినింగ్ బ్యాచ్ (PTC Training Batch) కానిస్టేబుళ్లు అంతా కలిసి రూ. 3 లక్షలు జమ చేశారు. ఆదివారం నస్రుల్లాబాద్‌లోని దుర్కిలో బుచ్చయ్య కుటుంబాన్ని కలిసి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు నర్సింగ్‌రావు, సురేష్, రాజశేఖర్, నరేష్, శైలేష్, నీతా, స్వప్న, శ్రీనివాస్, ప్రసాద్, రవీందర్, శివ,శేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.