అక్షరటుడే, నిజాంసాగర్: Constable Suspension | విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ విధులకు గైర్హాజరవుతున్న సిబ్బందిపై కామారెడ్డి పోలీస్ బాస్ కన్నెర్ర చేస్తున్నారు. చిన్న తప్పు చేసినా సస్పెండ్ చేసేందుకు వెనుకాడట్లేదు. నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సింగ్ (Constable Mohan Singh) సస్పెన్షన్ మరువకముందే అదే పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్‌ను ఎస్పీ రాజేష్ చంద్ర kamareddy SP Rajesh chandra సస్పెండ్ చేశారు.
కానిస్టేబుల్ రాకేష్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ పోలీస్‌స్టేషన్‌లో (Nizamsagar Police Station) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాకేష్ గౌడ్ ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. 5వ తేదీన పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.
డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ (Drunk and Drive Test) చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఎస్సై ఇచ్చిన నివేదిక ఆధారంగా శుక్రవారం రాకేష్ గౌడ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో పోలీసులు బాధ్యతారహిత ప్రవర్తన, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు.