అక్షరటుడే, ఇందూరు: BRS silver jubilee celebration : వరంగల్ warangal జిల్లాలో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర నేత బాజిరెడ్డి జగన్ brs leader bajireddy jagan పేర్కొన్నారు. సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని, దీంతో ప్రభుత్వానికి భయం మొదలైందని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏడాదిన్నర కాలంలోపే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని బాజిరెడ్డి జగన్ అన్నారు. తిరిగి కేసీఆర్ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ brs president Kcr సభ అనగానే ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్నారు. లక్షలాది మందితో సభ విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా తరలిరాబోతున్నారని జగన్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ప్రత్యేకించి రైతుల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రైతులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు.