అక్షరటుడే, భీమ్గల్ : Bheemgal SI : నిజామాబాద్ జిల్లా (Nizamabad district) భీమ్గల్(Bhimgal) ఎస్సైగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్సై సందీప్ ను శనివారం కాంగ్రెస్ పార్టీ (Congress party) మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని రకాలుగా పోలీస్ వారికి సహకరిస్తామన్నారు. ఎస్సైని కలిసి వారిలో నాయకులు రాగుల లింబాద్రి, గట్టు సతీష్ కుమార్, పిట్ల శ్రీనివాస్, రాగుల మోహన్, లక్కం మల్లేష్, కుమ్మరి శంకర్, ఓరుగంటి విజయ్ తదితరులున్నారు.