అక్షరటుడే, నిజాంసాగర్: Ration Cards | మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తోట లక్షీ కాంతారావు (Mla Laxmi Kantha Rao) ఆదేశాల మేరకు మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు.
Ration Cards | మండలంలోని ఆయా గ్రామాల్లో..
నిజాంసాగర్ (Nizamsagar), అచ్చంపేట (Achampet), బ్రాహ్మణపల్లి (Brahmanpalli), ఆరేపల్లి, వెలగనూరు, నర్సింగరావుపల్లి, మంగుళూరు, మాగి, గోర్గల్, వడ్డేపల్లి, మల్లూరు, జక్కాపూర్, తదితర గ్రామాల్లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ (Pital AMC) ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, తహసీల్దార్ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్లూరు గ్రామంలో రేషన్‌కార్డులను అందజేస్తున్న కాంగ్రెస్ నాయకులు
మాగి గ్రామంలో..
వడ్డేపల్లి గ్రామంలో..