అక్షరటుడే, డిచ్పల్లి: Mla Bhupathi Reddy | మహిళా సాధికారత సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanthreddy) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. బోర్గాం(పి) శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో (Bhumareddy Convention Hall) ఇందిరా మహిళా శక్తి (Indira Mahila Sakthi) సంబరాలను నిర్వహించారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ప్రమాద బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.
Mla Bhupathi Reddy | ఆర్థిక ప్రగతి సాధించాలి
ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో వ్యాపార లావాదేవీల నిర్వహణ ద్వారా ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. మహిళల ఉచిత ప్రయాణ ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు. 18 నెలల కాలంలోనే ఆర్టీసీకి రూ.6,500 కోట్లు చెల్లించిందని స్పష్టం చేశారు. మహిళా సాధికారతను కేవలం నినాదానికే పరిమితం చేయకుండా ఆచరణలో అమలు చేసి చూపుతున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లను సైతం మహిళల పేరుమీదే మంజూరు చేస్తున్నామని వివరించారు.
Mla Bhupathi Reddy | సోలార్‌ప్లాంట్లు.. ఆర్టీసీ బస్సులు..
మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు (Solar power plants), ఆర్టీసీ అద్దె బస్సులు (RTC Buses), పెట్రోల్ బంక్‌లు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రభుత్వం మహిళా సంఘాలకు అప్పగిస్తోందని భూపతిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా మహిళా శక్తి బజార్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు, స్కూల్ యూనిఫాంలు కుట్టడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి అనేక అంశాలలో అవకాశం కల్పిస్తూ వారి ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోందన్నారు.
33 శాతం రిజర్వేషన్ల కోసం తీర్మానం..
ఏటా రూ. 25 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో మహిళల సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు. కేవలం ఆర్థికంగా బలోపేతం చేయడమే కాకుండా రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిథ్యం కల్పించేలా చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ (State Seed Development Corporation) ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, సొసైటీల ఛైర్మన్లు, జిల్లా, మండల మహిళా సమాఖ్యల ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.