అక్షరటుడే, వెబ్‌డెస్క్: వరంగల్ సభతో brs sabha కాంగ్రెస్ సర్కారు పతనం ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి (BRS District President Jeevan Reddy) అన్నారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘రేవంత్ రెడ్డి గోబ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్’ (Revanth Reddy Goes Back, KCR Comes Back) అనేది ప్రజల మనసుల్లో ఉందని పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలను పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని పేర్కొన్నారు. 27న వరంగల్లో జరిగే సభను గులాబీమయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు (Former ZP Chairman Dadannagari Vittal Rao), బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజీత్ సింగ్, సత్యప్రకాష్, శేఖర్, రాజేశ్వర్ రెడ్డి, వెల్మల్ రాజన్న, మచ్చర్ల సాగర్, మస్త ప్రభాకర్ తదితరులున్నారు.