అక్షరటుడే, బాన్సువాడ: Hyderabad Meeting | హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో (LB Stadium) నిర్వహించే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి వర్ని మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయలుదేరి వెళ్లారు. పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపుర్ రాజారెడ్డి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో (local bodies election) పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకునేలా అధిష్టానం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో (Hyderabad) భారీ సభ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సభలో జాతీయ అధ్యక్షుడు ఖర్గే (National President Mallikarjun Kharge) పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు రంజానాయక్, అంబర్ సింగ్, కర్లం సాయి రెడ్డి, వెలగపూడి గోపాల్, బారీ, కలాల్ గిరి, నామాల సాయిబాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు కఅష్ణారెడ్డి, రఘు, సాయా గౌడ్, గజ్జల సాయిలు, సాయిలు, ప్రవీణ్ గౌడ్, అహ్మద్, శ్రీనివాస్, నగేష్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.