అక్షరటుడే, వెబ్‌డెస్క్ : PM Modi | పహల్గాం ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో ప్రధాని మోదీ pm modi కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన తన నివాసంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ CDS అనిల్ చౌహన్, ఎన్‌ఎస్‌ఏ NSA అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిణామాలు, భద్రతా సన్నద్ధతపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం.
తమకు సైన్యంపై నమ్మకం ఉందని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించారు. పహల్గాం దాడికి దీటైన సమాధానం ఇస్తామని, అలాగే సరిహద్దుల్లో అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని త్రివిద దళాధిపతులకు సూచించారు. సమయం చూసి ఉగ్రవాదులకు సైన్యమే గట్టిగా బదులు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం హోంమంత్రి అమిత్ షా home minister amit shaతో మోదీ సమావేశం కానున్నారు. ఇప్పటికే అమిత్ షా మోదీ నివాసానికి చేరుకున్నారు. కాగా.. రేపు మరోసారి సరిహద్దుల్లో భద్రతా చర్యలపై కేంద్రం సమీక్ష నిర్వహించనుంది. వరుస సమావేశాల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. మరోసారి భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తుందా..? లేక నేరుగా యుద్ధానికి దిగుతుందా..? అనే ఉత్కంఠ నెలకొంది.