అక్షరటుడే, వెబ్డెస్క్ :Terror Attack | కశ్మీర్లోని పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడిలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం(Jammu and Kashmir Government) పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం(Compensation) ఇవ్వనున్నట్లు తెలిపింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించింది.
కాగా కాల్పులు జరిగిన ప్రదేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పరిశీలించారు. మరోవైపు మృతదేహాలను వారి స్వస్థలాలకు ప్రత్యేక విమానాల్లో పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉగ్రదాడిలో మొత్తం 28 మంది చనిపోయారు. ఇందులో నేపాల్, యూఏఈకి చెందిన ఇద్దరు పౌరులు కూడా ఉన్నారు.