అక్షరటుడే, ఆర్మూర్: Police Community Contact Program | పట్టణంలోని జిరాయత్ నగర్(Jirayat Nagar) కాలనీలో శనివారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్(Probationary IPS Sai Kiran) ఆధ్వర్యంలో కాలనీలోని ఇళ్లను పరిశీలించారు. సరైన ధృవపత్రాలు లేని 72 బైక్లు, 7 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 30 మందిని గుర్తించారు. నంబర్ ప్లేట్లోని 15 వాహనాలు, ఒక ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి(Armoor ACP Venkateswara Reddy), సీఐలు సత్యనారాయణ, శ్రీధర్ రెడ్డి, పొన్నం సత్యనారాయణ, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.