ePaper
More
    Homeతెలంగాణpashamylaram | పాశమైలారం పేలుడు ఘటనపై కమిటీ ఏర్పాటు

    pashamylaram | పాశమైలారం పేలుడు ఘటనపై కమిటీ ఏర్పాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : pashamylaram | సంగారెడ్డి (Sangareddy) జిల్లా పాశమైలారం (pashamylaram)లోని సిగాచి ఫ్యాక్టరీలో ఇటీవల పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారు. మరో 33 మంది గాయపడినట్లు సిగాచి పరిశ్రమ (Sigachi Factory) యాజమాన్యం తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. క్షతగాత్రులకు వైద్య సాయంతో పాటు మృతులకు కంపెనీ నుంచి బీమా క్లెయిమ్​ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

    పాశమైలారం ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మంత్రులు వివేక్​, దామోదర రాజనర్సింహ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. తాజాగా ఈ ప్రమాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది.

    READ ALSO  Minister Seethakka | సొంత చెల్లెనే కేటీఆర్​ను నాయకుడిగా గుర్తించడం లేదు.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు

    pashamylaram | సమగ్ర దర్యాప్తు కోసం..

    సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దీంతో ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఏమిరేట్ సైంటిస్ట్ బి వెంకటేశ్వర్ ఈ కమిటీకి ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు. సీఎస్​ఐఆర్​ చీఫ్​ సైంటిస్ట్​ ప్రతాప్ కుమార్, రిటైర్డ్​ సైంటిస్ట్​ సూర్యనారాయణ, పూణే సీఐఎస్​ఆర్​ సేఫ్టీ ఆఫీసర్​ సంతోష్ సభ్యులుగా కమిటీ వేసింది. ప్రమాదంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.

    Latest articles

    GP Workers | పంచాయతీ కార్మికులకు శుభవార్త.. జీతాలు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు...

    Ura Pandaga | ఊర పండుగ ప్రత్యేకం “బండారు”.. కార్యక్రమంలో పాల్గొన్న సర్వసమాజ్​ సభ్యులు

    అక్షరటుడే ఇందూరు: Ura Pandaga | ఇందూరులో ఈ నెల 13న జరిగే ఊర పండుగకు సర్వ సమాజ్...

    Hydraa | రాజేంద్రనగర్​లో హైడ్రా కూల్చివేతలు.. జేసీబీలకు అడ్డంగా పడుకున్న మహిళలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Hydraa | హైదరాబాద్​ నగరంలోని రాజేంద్రనగర్​(Rajendranagar)లో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. అయితే ఈ కూల్చివేతలు...

    Bihar | కుటుంబాన్ని బ‌లిగొన్న మూఢ న‌మ్మ‌కం.. చేతబ‌డి నెపంతో ఐదుగురి హత్య

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bihar | బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన ఆందోళన కలిగిస్తోంది. మూఢనమ్మకాల పేరిట ఓ...

    More like this