అక్షరటుడే, వెబ్‌డెస్క్: National Medical Commission scam | నేషనల్ మెడికల్ కమిషన్ స్కాంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంలో సీబీఐ ఇప్పటి వరకు 36 మందిపై కేసు నమోదు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం.
National Medical Commission scam | ఏమిటీ స్కాం
నేషనల్ మెడికల్ కమిషన్ వైద్య కాలేజీలను తనిఖీ చేస్తోంది. అనంతరం అనుమతులు మంజూరు చేస్తుంది. అయితే కమిషన్‌లోని పలువురు మధ్యవర్తులతో కుమ్మక్కై మెడికల్ కాలేజీల నుంచి లంచాలు(Bribes) తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. ఆయా కాలేజీల్లో వసతులు లేకున్నా.. అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీబీఐ ఇప్పటి వరకు 36 మంది నిందితులపై కేసు నమోదు చేసింది.
National Medical Commission scam | వరంగల్ కొలంబో కాలేజీ ఛైర్మన్‌పై కేసు
వరంగల్‌లోని కొలంబో మెడికల్ కాలేజీ ఛైర్మన్ కొమ్మారెడ్డి జోసెఫ్(Kommareddy Joseph)కు కూడా ఈ స్కాంలో పాత్ర ఉంది. దీంతో ఆయనపై కూడా సీబీఐ కేసు(CBI Case) పెట్టింది. ఈ కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వైద్యులు ఉన్నట్లు సమాచారం. నిందితుల్లో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ఆరుగురు అధికారులు కూడా ఉన్నారు. మెడికల్ కాలేజీల తనిఖీ చేసి భారీగా లంచాలు తీసుకున్నట్లు కొమ్మారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మెడికల్ కాలేజీలో తనిఖీ కోసం కొమ్మారెడ్డికి విశాఖలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్(Gayatri Medical College) వెంకట్ నుంచి రూ.50 లక్షలు అందినట్లు సమాచారం. దీంతో వెంకట్‌పై కూడా సీబీఐ కేసు పెట్టింది.
National Medical Commission scam | ముందుగానే సమాచారం లీక్
మెడికల్ కమిషన్ అధికారులు(Medical Commission Officers) కాలేజీల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపడతారు. వసతులు, బోధన సిబ్బంది లేని కాలేజీలపై చర్యలు తీసుకుంటారు. దీంతో పలు కాలేజీల యాజమాన్యాలు (College Owners) కమిషన్‌లోని పలువురు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో తనిఖీల విషయాన్ని సదరు అధికారులు కాలేజీలకు ముందుగానే చేరవేసేవారు. దీని కోసం వారికి భారీగా లంచాలు ఇచ్చేవారని సీబీఐ గుర్తించింది. ముందుగానే సమాచారం తెలియడంతో ఆయా కాలేజీలు తనిఖీల సమయంలో అద్దె ఫ్యాకల్టీని పెట్టుకొని కమిషన్‌ను మోసం చేశాయి. అంతేగాకుండా పలు కాలేజీలు కమిషన్ సభ్యులకు భారీగా డబ్బులు ముట్టజెప్పి అప్రూవల్ పొందాయి. దీంతో విచారణ చేపట్టిన సీబీఐ 36 మంది కేసు నమోదు చేసింది. ఇందులో ఎన్ఎంసీ సభ్యులు(NMC Members), కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు(Central Health Ministry Officers) కూడా ఉన్నారు.