అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Simhachalam | విశాఖపట్నం జిల్లా సింహాచలం Simhachalam అప్పన్న appanna స్వామి చందనోత్సవాల సందర్భంగా జరిగిన ప్రమాదంలో పలువురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ PM modi, సీఎం చంద్రబాబు cm chandrababu, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ pavan kalyan దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఘటనపై విచారణ కమిషన్ Inquiry Commission ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మున్సిపల్ కమిషనర్ Municipal Commissioner సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఐపీఎస్ IPS అధికారి ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వేంకటేశ్వరరావు ఈ కమిషన్లో సభ్యులుగా ఉన్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవాదాయశాఖ ఆలయాల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాగా ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్ YS Jagan నాసిరకం పనులతోనే గోడ కూలిందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.