అక్షరటుడే, వెబ్‌డెస్క్: Collector Praveenya : సంగారెడ్డి (Sangareddy collector) కలెక్టర్ ప్రావీణ్య తాజాగా జహీరాబాద్ మండలంలో (Zaheerabad mandal) పర్యటించారు. హోతిలోని కస్తూర్బా బాలికల పాఠశాలను (Kasturba Girls School) (KGBV) సందర్శించారు. వంటగది, ఆహార నాణ్యత, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. వీటితో పాటు తరగతి గదిలో కూర్చుని బోధనా విధానాన్ని పర్యవేక్షించారు. అనంతరం బాలికలతో కలిసి నేలపై కూర్చుని సహపంక్తి భోజనం చేశారు.
Collector Praveenya : గతంలో..
2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రావీణ్య సింప్లిసిటీకి మారుపేరుగా నిలుస్తున్నారు. ఈమె గత నెల(జూన్ 13న) సంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు హనుమకొండ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. కాగా, ప్రావీణ్య తాజాగా బాలికలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేసిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె సింప్లిసిటీని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.
ఒక జిల్లా పాలనాధికారి సాధారణ మహిళగా వ్యవహరించడంపై నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆమె పాలసీని అభినందిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య పిల్లలతో కలిసి భోజనం చేయడం వల్ల.. వారిలో మనోధైర్యం, ప్రేరణ కలిగిస్తాయని పేర్కొంటున్నారు. ఆమె వినయం, నిబద్ధతకు సెల్యూట్ కొడుతున్నారు.
నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోను పరిశీలిస్తే.. అందులో కలెక్టర్ ప్రావీణ్య తన పక్కన కూర్చున్న బాలికతో ముచ్చటిస్తున్నట్లు ఉంది. ఒక కలెక్టర్ పక్కనే కూర్చుని, భోజనం చేస్తూ.. ముచ్చటిస్తుండటం అబ్బురంగా ఉందంటున్నారు పలువురు.
సాధారణంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (Kasturba Ganghi balikala Vidyalayam) నిరుపేద, నా అంటూ ఎవరూ లేని అభాగ్య బాలికలు చదువుతుంటారు. ఇలాంటి వారు నిరాదరణకు గురవుతుంటారు. అలాంటి వారితో కలిసి కలెక్టర్ ప్రావీణ్య భోజనం చేయడం వల్ల.. వారిలో ఆత్మన్యూనతా భావం పోయి, ప్రేరణ కలుగుతుందని చెబుతున్నారు.