అక్షరటుడే, ఇందూరు: Kanjara Gurukul | మోపాల్ మండలం (Mopal Mandal) కంజర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kanjara Gurukul | మధ్యాహ్న భోజనం పరిశీలన..
కలెక్టర్ పాఠశాలలోని కిచెన్, డార్మెటరీ, స్టోర్ రూమ్, డైనింగ్ హాల్, మధ్యాహ్న భోజనాన్ని (Mid day Meals) పరిశీలించారు. స్టోర్‌రూంలో నిల్వ ఉన్న బియ్యం, పప్పులు, వంట నూనె తదితర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థినుల ఆరోగ్య స్థితిగతులు, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.
Kanjara Gurukul | విద్యార్థుల ద్వారా వివరాల సేకరణ
అల్పాహారం, భోజనం రుచికరంగా ఉంటోందా.. అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా.. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని బాలికలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నిర్వహణ సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి