అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Ration Cards | కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) పంపిణీపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 14న సీఎం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కొత్త కార్డులు పంపిణీ చేయాలని మొదట భావించారు. అనివార్య కారణాలతో పంపిణీ చేయలేదు. ఈ క్రమంలో సీఎం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీఎం సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) నిర్వహించారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్‌కార్డుల పంపిణీ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.
New Ration Cards | కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
కలెక్టర్లు (Collectors) నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. వారు రోజూ ఏ పని చేశారో తనకు తెలపాలని సూచించారు. రాష్ట్రంలో యూరియా (Urea), ఇతర ఎరువుల నిల్వలు సరిపోయినంత ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
New Ration Cards | గిగ్ వర్కర్స్ బిల్లుపై..
గిగ్ వర్కర్స్ బిల్లుపై సీఎం సమీక్షించారు. వారికి చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని అధికారులు ప్రతిపాదించారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రమాద, ఆరోగ్య బీమా వర్తింపజేసేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామికి సూచించారు.