అక్షరటుడే, వెబ్డెస్క్ : RTC Strike | ఆర్టీసీ కార్మికుల (rtc employees) సమ్మెపై సీఎం రేవంత్రెడ్డి (Cm revanth reddy) స్పందించారు. గురువారం ఆయన మే డే సందర్భంగా రవీంద్ర భారతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని కోరారు. సంస్థ మనందరిదది అని, దానిని కాపాడుకుందామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేస్తామన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చామని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో సమ్మె చేస్తే సంస్థ దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. గతంలో కార్మికులు 42 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ kcr పట్టించుకోలేదన్నారు. కార్మికులు తమ సమస్యలపై ప్రభుత్వంతో చర్చించాలని ముఖ్యమంత్రి సూచించారు.
RTC Strike | కేసీఆర్ కపట నాటక సూత్రధారి
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)పై సీఎం రేవంత్రెడ్డి(CM Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కపట నాటక సూత్రధారి అని, విషం నింపుకొని మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పదేళ్లలో తెలంగాణ (telangana)ను కేసీఆర్ అప్పులపాలు చేశారన్నారు. 60 ఏళ్లలో రూ.72 వేల కోట్లు అప్పులు చేస్తే, కేసీఆర్ పదేళ్లలో రూ.7లక్షల కోట్లు అప్పులు చేశారని పేర్కొన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలిందని విమర్శించారు.