అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cm revanth reddy | పార్టీ నేతలకు సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి cm revanth reddy వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాను ఎవరికైనా కమిట్‌మెంట్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పారు. కొందరు పదవులు రాలేదని నోరుజారుతున్నారని.. అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని పేర్కొన్నారు.
కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని మండిపడ్డారు. సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారలేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం సరికాదని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అద్దంకి దయాకర్‌కు MLC ఇస్తానని చెప్పాను.. చెప్పినట్లుగా ఇప్పించానన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని హెచ్చరించారు.