అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ఆపరేషన్ సిందూర్‌తో భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పీవోకే, పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్, హైదరాబాద్‌లో మాక్ డ్రిల్‌పై బుధవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్‌లో హైలెవల్ కమిటీ భేటీ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
CM Revanth Reddy | సమన్వయంతో పని చేయాలి
ఒకవేళ భారత్‌పై పాక్ ప్రతిదాడి చేస్తే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆఏశించారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని విదేశీ రాయబర కార్యాలయాలు, రక్షణశాఖ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. ఇప్పటికే పోలీసు శాఖలో సెలవులు రద్దు చేశారు.
వైద్యం, పౌర సరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.