అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nayanathara | సినీ సెలబ్రిటీలు విడాకుల విషయం ఎంత పెద్ద సంచలనంగా మారుతుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ప్రముఖ లేడీ సూపర్‌స్టార్ నయనతార కూడా అదే బాటలో నడుస్తున్నారనే ప్రచారం నెట్టింట్లో కలకలం రేపుతోంది. గతంలో సమంత – నాగచైతన్య విడాకులు, ఆ తర్వాత ధనుష్, అమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్ విడాకులు వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు నయనతార(Heroine Nayanthara) పేరు కూడా ఆ లిస్ట్‌లో చేరడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Nayanathara | అంతా ఫేక్..
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో బిజీగా నటించిన నయనతార.. ప్రత్యేకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో(Lady-Oriented Movies) తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే దర్శకుడు విఘ్నేష్ శివన్(Director Vignesh Sivan)తో ప్రేమలో పడిన నయన్, కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2022లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ జంట హ్యాపీగా గడుపుతున్నట్టు కనిపించినప్పటికీ, తాజాగా నయన్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు అనేక అనుమానాలకు తావిస్తోంది. “తెలివితక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది పెద్ద తప్పే. భర్త చేసే పనులకు భార్య బాధ్యత వహించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఇప్పటికే చాలానే ఎదుర్కొన్నా” అంటూ పోస్ట్ పెట్టింది.
అయితే ఆ పోస్టు కొన్ని గంటల్లోనే తొలగించినప్పటికీ, అప్పటికే స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫలితంగా నయనతార – విఘ్నేష్ శివన్ మధ్య విభేదాలు మొదలయ్యాయా? అనే చర్చ తారాస్థాయికి చేరింది. అయితే తాజాగా నయనతార – విఘ్నేష్ శివన్ జంట పళని స్వామి ఆలయం (Palani Swamy Temple)లో దర్శనమివ్వడంతో పుకార్లకి పులిస్టాప్ పెట్టినట్టు అయింది. ఆలయానికి పిల్లలతో వచ్చిన ఈ జంట సాష్టాంగ నమస్కారాలు చేశారు. చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఇది చూసి నయనతార- విఘ్నేష్ శివన్ జంట విడాకులు వార్తలు ఫేక్ అంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు