అక్షరటుడే, కామారెడ్డి: Civil Rights Day | గ్రామాల్లో సివిల్ రైట్స్ డే (Civil Rights Day) నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్సీఎస్టీ ల్యాండ్, అట్రాసిటీ కేసులపై సంబంధిత అధికారులు, సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ చట్టాలు, సంక్షేమ పథకాలపై (welfare schemes) విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి పెండింగ్ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలన్నారు. ప్రతినెల చివరివారంలో సివిల్ రైట్స్ డే, మూడునెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో కొత్త విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి, జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను (Collector Ashish Sangwan) అభినందించారు.
Civil Rights Day | బెస్ట్‌అవైలబుల్ నిధుల జాప్యంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..
జిల్లాలో బెస్ట్‌అవైలబుల్ స్కూళ్లకు సంబంధించి నిధుల అమలులో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బక్కి వెంకటయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను ఆ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకే ఉపయోగించాలని, కాంట్రాక్ట్ పనుల్లోనూ వారికి రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్ ప్రకారం కేటాయించాలన్నారు.
Civil Rights Day | సమస్యలు పరిష్కరించాలి
దేవునిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న లింగంపేట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను లింగంపేటలోనే (Lingampeta Social Welfare Residential School) నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ ఆదేశించారు. సదాశివనగర్ మండలం లింగంపల్లి, భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామాల్లో దళితుల భూముల సమస్యలను పరిష్కరించి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లు వేయించాలని సూచించారు. ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆర్డీవో ఆధ్వర్యంలో పరిశీలించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), ఏఎస్పీ చైతన్యరెడ్డి (ASP Chaitanya Reddy), ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, విక్టర్, ఆర్డీఓ వీణ, డీఎస్పీలు, ఆయాశాఖల జిల్లా అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.