More
    Homeక్రీడలుFinn Allen | సిక్సుల వ‌ర్షం కురిపించిన ఆర్సీబీ స్టార్.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు

    Finn Allen | సిక్సుల వ‌ర్షం కురిపించిన ఆర్సీబీ స్టార్.. క్రిస్ గేల్ రికార్డు బ‌ద్ద‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Finn Allen | న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్ (Finn Allen) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవ‌డంతో భారీ స్కోరు న‌మోదైంది. సిక్సుల మీద సిక్సులు కొడుతూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన ఇత‌ను సిక్సుల వర్షం కురిపిస్తూ చూస్తుండగానే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(Chris Gayle) పేరు మీద ఉన్న ఒక అరుదైన రికార్డును అతడు బద్దలుకొట్టాడు. మేజర్ లీగ్ క్రికెట్ 2025లో (Major League Cricket 2025) భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌-వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన పోరులో ఇది చోటుచేసుకుంది. ఐపీఎల్ మెగావేలంలో అన్​సోల్డ్. రూ.2 కోట్ల బేస్​ప్రైజ్​తో వేలంలోకి వచ్చిన అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఐపీఎల్ సీజన్ 18కి దూరమయ్యాడు.

    READ ALSO  WTC Final | ఎన్నో ఏళ్ల క‌ల నెర‌వేర్చుకునేందుకు కొద్ది దూరంలో స‌ఫారీ జ‌ట్టు

    Finn Allen | బాదితే సిక్స‌ర్..

    కానీ, మరో టీ20 లీగ్​లో (T20 league) అవకాశం దక్కించుకున్న ఆ బ్యాటర్ రెచ్చిపోయాడు. ఏకంగా తొలి మ్యాచ్​లోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డు​ను బద్దలు కొట్టాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, న్యూజిలాండ్​కు చెందిన ఫిన్ అలెన్. అమెరికా డొమెస్టిక్ టోర్నీ మేజర్ క్రికెట్ లీగ్ 2025 గురువారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్​లో శాన్​ఫ్రాన్సిస్కో యూనికార్న్(San Francisco Unicorn)- వాషింగ్టన్ ఫ్రీడమ్(Washington Freedom) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో 20 ఓవర్లలో 269-5 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిన్ అలెన్ ఓపెనర్​గా బరిలోకి దిగాడు.

    ఫిన్ అలెన్(Finn Allen) విశ్వరూపం చూపించ‌డంతో 51 బంతుల్లోనే 151 పరుగులు బాదేశాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు ఏకంగా 19 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 124 పరుగులు పిండుకున్నాడు అలెన్. గ్రౌండ్‌ నలువైపులా షాట్లు కొడుతూ బౌలర్లతో ఓ రేంజ్‌లో ఆటాడుకున్నాడు. బంతి వేయాలంటే భయపడేలా చేశాడు. ఎటు బంతి వేసినా స్టాండ్స్‌లోకి తరలిస్తూ పోయాడు. లెగ్ సైడ్ బౌండరీని టార్గెట్ చేసుకొని భారీ సిక్సులు బాదాడు అలెన్. ఈ క్రమంలో 34 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇన్నింగ్స్ మొత్తంలో 19 సిక్సులు బాదాడు అలెన్. తద్వారా టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు క్రిస్ గేల్ (18 సిక్సులు), సాహిల్ చౌహాన్ (18 సిక్సులు) పేరిట ఉన్న సంయుక్త రికార్డును అతడు చెరిపేశాడు. కాగా, 2022తో పాటు 2023 ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఆడాడు అలెన్. ఈ సీజన్‌కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అతడిని తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు.

    READ ALSO  Wasim Akram Statue | హైదరాబాద్‌లో పాక్ బౌల‌ర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌.. ముఖ కవళికలు చూసి ఫ్యాన్స్ కూడా న‌వ్వుకుంటున్నారు..!

    Latest articles

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...

    Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా చేస్తే...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 15 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – జ్యేష్ఠపక్షం...

    US Army Day | యూఎస్​ ఆర్మీ డే వేడుకలు.. పాక్​ ఆర్మీ చీఫ్​ను ఆహ్వానించలేదని ప్రకటన

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US Army Day : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్(Pakistan Army Chief...

    More like this

    Yoga | యోగాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga | యోగా చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా తయారవుతాం. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాలు...

    Yoga | యోగాకు ముందు సూక్ష్మ వ్యాయామం తప్పనిసరి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exercise | యోగా(Yoga) సాధన శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత ఇస్తుంది. నిత్యం యోగా చేస్తే...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 15 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – ఆదివారంమాసం – జ్యేష్ఠపక్షం...