More
    HomeసినిమాPawan Kalyan | ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. త‌మ్ముడి మూవీ షూటింగ్...

    Pawan Kalyan | ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. త‌మ్ముడి మూవీ షూటింగ్ చూస్తూ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Pawan Kalyan | పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్​లో తెరకెక్కుతున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustad Bhagat Singh). ప‌వ‌న్ బిజీ షెడ్యూల్ వ‌ల‌న అట‌కెక్కిన ఈ ప్రాజెక్ట్ తిరిగి మొదలైంది. మూవీ చిత్రీకరణ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌(Hyderabad)లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇందులో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, సెట్స్‌కు అనూహ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేయడం అభిమానుల్లో సంబరాన్ని కలిగించింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ సెట్‌కి చిరు వ‌చ్చి ప్రత్యేకంగా సమయం కేటాయించడం హాట్ టాపిక్‌గా మారింది.

    Pawan Kalyan | మెగా ఎంట్రీ..

    సోమవారం జరిగిన షూటింగ్ సమయంలో చిరంజీవి (Chiranjeevi) స్వయంగా సెట్లోకి వచ్చారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న సన్నివేశాన్ని దగ్గర నుంచే వీక్షించారు. ఈ స్పెషల్ మూమెంట్‌ను బాగా క్యాప్చర్ చేశారు. ఆ ఫొటోలో చిరు షూటింగ్‌ చూస్తుంటే, పవన్ పక్కనే నిలబడినట్టు కనిపించడం ఫ్యాన్స్‌కు ఒక ఎమోషనల్ మోమెంట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మెగా బ్రదర్స్ మాసివ్ మూమెంట్” అంటూ అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) నిజ జీవితంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఓ మాస్ సీన్ తెరకెక్కిస్తున్నారు హ‌రీష్ శంక‌ర్.

    READ ALSO  Mahaa News | మ‌హా న్యూస్ ఛానెల్‌పై దాడి.. ఖండించిన చంద్ర‌బాబు, ప‌వ‌న్ , లోకేష్‌, బండి సంజ‌య్

    ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న స‌మ‌యంలో ఓ సారి అనుకోని విధంగా కార్ రూఫ్‌పై కూర్చొని, ఇరువైపులా సెక్యూరిటీతో, వెనుక అభిమానులతో ప‌వ‌న్ కొంత దూరం ప్రయాణం చేశారు. ఈ వీడియో గతంలో వైరల్ అయింది. ఈ ఘటనను డైరెక్టర్ హరీష్ శంకర్ త‌న‌ సినిమా కోసం రీ-క్రియేట్ చేస్తున్నట్లు స్వయంగా ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. ఈ సీన్ థియేటర్లలో ప్రదర్శితమైతే, ఫాన్స్ విజిల్స్‌తో థియేటర్ కంపించకమానదు అంటున్నారు నెటిజన్లు. ఇక‌ గబ్బర్ సింగ్ కాంబో రిపీట్ కావ‌డంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇందులో శ్రీలీల (Heroine Sreeleela) క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Latest articles

    Hyderabad City | హైదరాబాద్‌లో భారీ వర్షం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad City | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా...

    BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా భూపెందర్ యాదవ్..? రేసులో అందరి కన్నా ముందున్న కేంద్ర మంత్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP National President | బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఆసక్తితో పాటు ఉత్కంఠ నెలకొంది....

    Kerala | ట్రాలీ బ్యాగుల్లో గంజాయి తరలింపు.. ఇద్దరు మహిళల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala | దేశవ్యాప్తంగా గంజాయి దందా యథేచ్ఛగా సాగుతోంది. దేశంలోని పలు ప్రధాన నగరాలే...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. నిత్యం ఏసీబీ...

    More like this