అక్షరటుడే, న్యూఢిల్లీ: Pakistan : పాకిస్తాన్ సైనిక శక్తికి సాయం చేసే దేశాలు మూడు ఉన్నాయి. చైనా(China), తుర్కియే(టర్కీ)(Turkey) కాకుండా.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే మరొక దేశం పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదే నెదర్లాండ్స్(Netherlands).
చైనా తర్వాత పాక్‌కు రెండో అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్నది నెదర్లాండ్స్. ఈ నేపథ్యంలో ఈ దేశం కూడా బైకాట్కు గురికాబోతుందా..? అనేది ప్రస్తుతం చర్చకు దారితీసింది. ఎందుకంటే నెదర్లాండ్స్ కు భారత్ పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది.
విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్(External Affairs Minister Dr. S. Jaishankar) నెదర్లాండ్స్, డెన్మార్క్(Denmark), జర్మనీ(Germany) దేశాలలో పర్యటిస్తున్నారు. ఆరు రోజుల పర్యటనలో భాగంగా మే 19న నెదర్లాండ్స్ చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. ఎస్.జైశంకర్‌కు ఇది మొదటి విదేశీ పర్యటన కావడం గమనార్హం. కాగా, పాకిస్తాన్‌కు రెండో అతిపెద్ద ఆయుధాలు సరఫరా దేశంలో భారత్ విదేశాంగ మంత్రి పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని నెదర్లాండ్స్ ప్రధాని, విదేశాంగ, రక్షణ మంత్రులను కలిసిన తర్వాత.. జైశంకర్ సామాజిక మాధ్యమ వేదిక X(ocial media platform X)లో ఒక పోస్టు పెట్టారు. ‘‘హేగ్(Hague)లో ప్రధాని డిక్ స్కాఫ్(Prime Minister Dick Schaaf)ను కలవడం ఆనందంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) తరఫున శుభాకాంక్షలు తెలియజేశా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నెదర్లాండ్స్ దృఢ వైఖరికి ధన్యవాదాలు తెలియజేశాను’’ అని రాసుకొచ్చారు.
‘‘భారతదేశం-నెదర్లాండ్స్ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే ఆ దేశ ప్రధాని నిబద్ధతను అభినందిస్తున్నా. ఈ లక్ష్యాలు సాధించడానికి రెండు దేశాలు కష్టపడి పనిచేస్తాయనే నమ్మకం ఉంది.’’ అని కేంద్ర మంత్రి జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
కాగా, పాకిస్తాన్‌కు నెదర్లాండ్స్ అతిపెద్ద ఆయుధాలు సరఫరా చేసే రెండో దేశంగా ఉంది. అయితే నెదర్లాండ్‌కు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత్ తన ఆర్థిక శక్తిని వినియోగించి, పాక్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దని నెదర్లాండ్స్‌పై ఒత్తిడి తీసుకురావొచ్చని తెలుస్తోంది.
భారత్ ఒక్క నెదర్లాండ్స్తోనే 22 బిలియన్ డాలర్ల వాణిజ్య భాగస్వామ్యం కలిగి ఉంది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే.. మొత్తం యూరప్‌తో కేవలం 15 బిలియన్ డాలర్ల వ్యాపారం మాత్రమే చేస్తుండడం గమనార్హం.
పాకిస్తాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం కొనసాగిస్తే, తుర్కియే లాంటి పరిస్థితి నెదర్లాండ్స్ కూడా ఎదరయ్యే ప్రమాదం లేకపోలేదు. అయితే చైనా, తుర్కియే మాదిరి.. నెదర్లాండ్స్‌కు పాక్ పట్ల ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఇక పాకిస్తాన్ వల్ల పరిస్థితులు భారత్‌తో సంబంధాలు తెంచుకునేంత విబేధాలు నెదర్లాండ్స్ కు లేవు.
మూడు దేశాల నుంచి పాక్ ఆయుధాలు అందుకుంటోంది. చైనా అతిపెద్ద సరఫరాదారు, నెదర్లాండ్స్ రెండో స్థానంలో, తుర్కియే మూడో స్థానంలో ఉన్నాయి. పాక్ ఆయుధ నిల్వల్లో 81 శాతం చైనా నుంచి, 5.5 శాతం నెదర్లాండ్స్, 3.8 శాతం ఆయుధాలు తుర్కియే నుంచి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2020 _ 24 వరకు ఐదేళ్ల డేటా. 2024 ఏడాది గణాంకాలు పరిశీలిస్తే.. నెదర్లాండ్స్ కంటే పాకిస్తాన్‌కు తుర్కియే ఎక్కువ ఆయుధాలు సరఫరా చేసింది. మరి భవిష్యత్తులో పాకిస్తాన్‌కు నెదర్లాండ్స్ దూరంగా ఉంటోందో లేదో వేచి చూడాల్సిందే.