అక్షరటుడే, వెబ్‌డెస్క్: 10G network | తన ఆవిష్కరణలు, సాంకేతికతతో ప్రపంచాన్ని అబ్బురపరిచే చైనా china country తాజాగా మరో కీలక ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా 10జీ 10G brand బ్రాడ్‌బాండ్ broadband నెట్వర్క్ network లాంచ్ చేసింది. హువాయి huawei, చైనా యునికామ్ china unicom సంయుక్తంగా దీనిని లాంచ్ చేశాయి.
మన దేశంలో ప్రస్తుతం 5జీ అప్‌గ్రేడెషన్ జరుగుతోంది. ఎయిర్టెల్ Airtel, జియో Jio 5జీలోకి మారినా.. చాలా ప్రాంతాల్లో ఇంకా 5జీ సిగ్నల్ రావడం లేదు. చైనా మాత్రం 10జీ బ్రాడ్‌బాండ్ సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ బ్రాడ్‌బ్యాండ్ డౌన్లోడ్ స్పీడ్ 9,834 ఎంబీపీఎస్ mbps కాగా.. అప్లోడ్ స్పీడ్ 1,008 ఎంబీపీఎస్ కావడం గమనార్హం. ఇంటర్నెట్ రంగంలో ఇదో విప్లవాత్మక మార్పుగా నిపుణులు పేర్కొంటున్నారు.