అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rajasthan | దేశంలో ప్రజల్లో రీల్స్ పిచ్చి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. లైక్స్, వ్యూస్ కోసం వ్యక్తులు తాము చేసే పనులతో, కుటుంబ సభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం (Rajasthan State) భారత్‌పూర్ జిల్లాలోని బంద్ బరైతా రిజర్వాయర్ వద్ద జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఉమాశంకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో రీల్స్ కోసం తన చిన్నారి ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ప్రమాదకరమైన ఇనుప ఫ్రేమ్‌పై బలవంతంగా కూర్చోబెట్టాడు. ఆ ఫ్రేమ్ బంద్ బరైతా రిజర్వాయర్(Baraita Reservoir)పై ఏర్పాటు చేయబడింది. ఎలాంటి రక్షణా చర్యలు లేకపోవడంతో, చిన్నారి భయంతో భయపడుతున్నప్పటికీ ఆమెను బెదిరించి మరీ అక్కడ కూర్చోపెట్టి వీడియోలు తీశాడు. అనంతరం ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Rajasthan | ఇదేం పిచ్చి..
ఈ వీడియో చూసిన వారు ఉలిక్కిపడ్డారు. ఫ్రేమ్ కింద ఏ రక్షణ లేదు. ఆ చిన్నారి నీటిలోకి పడిపోతుందేమో అన్నంత ప్రమాదకర పరిస్థితి అక్కడ ఉంది. తన కూతురు భయపడుతుంటే కూడా.. లైక్స్ కోసం ఇలా చేయడం ఏమిటి? అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. “ఇది సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్ కాదు, పిచ్చి!” అని కొందరు, ఇవన్నీ పిల్లల మానసిక ఆందోళనకు దారితీస్తాయని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో(Viral Video)పై విమర్శలు తీవ్రం కావడంతో ఉమాశంకర్ వెంటనే ఆ వీడియోను తన అకౌంట్ నుంచి తొలగించాడు. అయినప్పటికీ, అప్పటికే చాలా మంది ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసి షేర్ చేయడంతో ఇది సామాజిక బాధ్యతలలో పెద్ద చర్చకు దారితీసింది.
పిల్లల హక్కుల పరిరక్షణకు పని చేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ ఘటనపై స్పందిస్తూ, “ఇలాంటి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు.. ఇది ఒక రకమైన పిచ్చిఅంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee) విచారణ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటన మరోసారి తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని, సోషల్ మీడియా ప్రభావాన్ని ప్రశ్నిస్తుంది. పిల్లల భద్రతను పక్కన పెట్టి, కేవలం సోషల్ మీడియా ఫేమ్ కోసం ఇలాంటి చర్యలకు దిగడం ఏమాత్రం సమర్థించదగినది కాదు. రెగ్యులర్‌గా సోషల్ మీడియాలో కంటెంట్ రూపొందించే వారంతా సెల్ఫ్ కంట్రోల్, భద్రతా జాగ్రత్తలు అనే రెండు పదాలను మైండ్‌లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read all the Latest News on Aksharatoday.in