అక్షరటుడే, వెబ్‌డెస్క్: Chava Movie | విక్కీ కౌశల్ Vicky Kaushal, రష్మిక మందన్న Rashmika Mandanna నటించిన చావా Chava చిత్రం మరో రికార్డు సాధించింది. బంపర్ హిట్‌కొట్టిన ఈ సినిమా తాజాగా రూ.600 కోట్ల వసూళ్లు రాబట్టిన జాబితాలో చేరింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ Chhatrapati Shivaji Maharaj కుమారుడు మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ Chhatrapati Shambhaji Maharaj జీవితం ఆధారంగా రూపొందించబడిన ఈ చారిత్రక చిత్రం ఇండియాలో రూ.600 కోట్ల మార్కును దాటింది. పుష్ప 2, స్త్రీ 2 తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో చిత్రంగా చావా నిలిచింది. ఇది ఈ మార్కును చేరుకున్న రెండవ బాలీవుడ్ చిత్రం.
Chava Movie | బాలీవుడ్‌లో భారీ విజయం..
అట్టర్‌ఫ్లాప్‌లతో బాలీవుడ్‌లో నిరాశపూరితమైన వాతావరణం నెలకొన్న తరుణంలో చావా విజయం బీ-టౌన్‌కు ఊపిరి పోసినట్లయింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన చావా బలమైన పాత్రల చిత్రీకరణ, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, అత్యుత్తమ ప్రదర్శనలతో ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ఇప్పటిదాకా హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలో పుష్ప-2 రూ.812.14 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, స్ట్రీ 2 రూ597.99 కోట్లు, చావా రూ.585.43 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆత ర్వాత జవాన్ రూ.582.31 కోట్లు, గదర్-2 రూ.525.7 కోట్లు, పఠాన్ రూ.524.53 కోట్లు, బాహుబలి-2 రూ.510.99 కోట్లు, యానిమల్ రూ.502.98 కోట్లు, కేజీఎఫ్-2 రూ.435.33 కోట్లు, దంగల్ రూ.374.43 కోట్ల కలెక్షన్లు సాధించాయి.
Chava Movie | చిత్రబృందం వేడుకలు..
రూ.600 క్లబ్‌లోకి చేరవడంతో చావా చిత్రబృందం వేడుకలు Film crew celebrations జరుపుకుంది. “600 నాట్ అవుట్, చావా రూ600 కోట్ల మార్కును దాటింది. పుష్ప 2 హిందీ, స్ట్రీ 2 తర్వాత, చావా ఈ మైలురాయిని చేరుకున్న మూడవ చిత్రం ఇది. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ All-time blockbuster. చావాకి ఇంత ప్రేమను అందించినందుకు షుకర్ రబ్ దా తే సబ్ దా Thank you very much, everyone.. (దేవునికి మరియు మీ అందరికీ కృతజ్ఞతలు)” షామ్ చిత్రం రూపొందించిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.