అక్షరటుడే, న్యూఢిల్లీ: UPS : ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) Unified Pension Scheme (UPS) ప్రోత్సహించేందుకు తాజాగా కేంద్ర సర్కారు శ్రీకారం చుట్టింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ (ఎన్పీఎస్) కింద ఉన్న వారితో సమానంగా ‘యూపీఎస్’ను ఎంచుకునే వారికి కూడా పన్ను ప్రయోజనాలు అందించాలని నిర్ణయించింది.
UPS : నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..
‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించాం.. వారి పదవీ విరమణ భద్రతను బలోపేతం చేయనున్నాం. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు పన్ను చట్రంలోకి ఏకీకృత పెన్షన్ పథకం (యూపీఎస్) చేర్చాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకమైన, సౌకర్యవంతమైన, సమర్థవంతమైన పన్ను విధానాలను ఎంచుకోవచ్చు’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు.
UPS : మొదట వారికే..
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 24, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమంటే.. సివిల్ సర్వీస్‌లకు ఎంపికైన వారికి ఎన్పీఎస్ కింద ఒక ఆప్షన్‌గా యూపీఎస్‌ను ప్రవేశపెట్టింది. ఈ సదుపాయం ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. కానీ, ఎన్పీఎస్ కింద ఉన్న ఉద్యోగులు.. యూపీఎస్లోకి మారాలంటే వన్-టైమ్ ఆప్షన్ మాత్రమే ఉండడం గమనార్హం.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) Pension Fund Regulatory and Development Authority (PFRDA).. దీనిని అమలు చేయడానికి మార్చి 19, 2025న ఎన్పీఎస్ కింద యూపీఎస్ నిర్వహణ నిబంధనలను నోటిఫై చేసింది. జనవరి 1, 2004న అమల్లోకి వచ్చిన ఎన్పీఎస్ కింద ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే యూపీఎస్ ఆప్షన్ వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో దీనిని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే అవకాశం ఉంది.
UPS : గతేడాది నిర్ణయం..
జనవరి, 2004 నుంచి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) old pension scheme (OPS) నిలిపివేయబడింది. దీని కింద ఉన్న ఉద్యోగులు వారు చివరగా పొందే మూలవేతనంలో 50 శాతం పెన్షన్‌గా అందుకునేవారు. కాగా, ఆగస్టు 24, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో యూపీఎస్ పథకం ఆమోదం పొందింది.