అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Anirudh | బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో చంద్రబాబు (Chandra Babu) కోవర్టులు ఉన్నారని తాను చేసిన వాఖ్యలు కేవలం కాంట్రాక్టర్లను ఉద్దేశించి మాత్రమే అన్నానని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి(MLA Anirudh Reddy) తెలిపారు. తాను నాయకుల గురించి మాట్లాడలేదని, కాంట్రాక్టర్ల గురించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. పార్టీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా ఆధారాలుంటే పార్టీకి అందజేయాలని, బయట మాట్లాడవద్దని సూచించారు. ఈ నేపథ్యంలోనే అనిరుధ్‌రెడ్డి తన వ్యాఖ్యలపై శనివారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.
MLA Anirudh | విపక్ష నేతల తప్పుడు ప్రచారం..
విపక్ష నాయకులు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టం చేశారు. తాను మాట్లాడిన వీడియోను చూడకుండానే కొందరు విపక్ష నేతలు.. తాను నాయకుల ఉద్దేశించి కోవర్టులంటూ మాట్లాడానని తప్పుడు ప్రచారం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి వ్యక్తులు కాంట్రాక్టర్లుగా పని చేస్తున్నారని, వారు ఇరిగేషన్ ప్రాజెక్టులు (Irrigation Projects), పెద్ద రోడ్డు కాంట్రాక్టర్లు (Road Contractors), హైదరాబాద్‌లో దండాలు చేస్తున్నారని.. వారిని టైట్ చేస్తే వారే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల ప్రాజెక్టు ఆపుతారని మాత్రమే తాను చెప్పానని వివరించారు. అంతే తప్ప తాను ఏ నాయకుడి గురించి మాట్లాడలేదని చెప్పారు.
MLA Anirudh | కేసీఆర్ వచ్చింది టీడీపీ నుంచే..
తాను చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌తో సహా కొంతమంది విపక్ష నాయకులు వక్రీకరిస్తూ చంద్రబాబు కోవర్ట్ అని తాను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు చెప్పడంపై అనిరుధ్‌రెడ్డి(Mla Anirudh reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన కారణంగా చంద్రబాబు కోవర్ట్ అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని.. మరీ ఆయనను కూడా చంద్రబాబు కోవర్టుగా పరిగణించాలా? అని ప్రశ్నించారు. తాను మాట్లాడిన వీడియోను చూసి తర్వాతే దానిపై స్పందించాలని, అదేమీ చూడకుండానే మాట్లాడడం సబబు కాదని ఆయన హితపు పలికారు. తాను కేవలం కాంట్రాక్టర్ల గురించే మాట్లాడానని, చంద్రబాబు కోవర్టులని వాళ్లని మాత్రమే అన్నానని తెలిపారు. నాయకుల గురించి ఎక్కడ మాట్లాడలేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదంలో సీఎంను లాగకండి అని ఆయన కోరారు. ఈ వీడియోను చూడకుండా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే సహించేదే లేదని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.