అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rain Alert | తెలంగాణ Telanganaలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు heavy rains పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ Meteorological Department హెచ్చరించింది. రానున్న రెండు గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షం పడొచ్చని పేర్కొంది.
ఉత్తర north telangana, మధ్య central telangana తెలంగాణలో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. హైదరాబాద్ hyderabadలో చెదురుముదురు వానలు కురిసే ఛాన్స్ ఉంది. మరోవైపు మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది.